ADB: చింతలమానేపల్లి (M) రణవెల్లిలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మహిళా సర్పంచ్ అభ్యర్థి దర్శనను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని బెదిరిస్తూ, గుర్తుతెలియని వ్యక్తులు మామ జాడి బాపుకు తుపాకీ పెట్టి బెదిరించారు. అంతేకాకుండా ‘దళం’ పేరిట ఓ లేఖను కూడా అందించారు. సమాచారం అందుకున్న కౌటాల సీఐ సంతోశ్ కుమార్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.