AP: తమిళనాడు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విజయనగరం జిల్లా వాసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్న.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు హోంమంత్రి అనిత, మంత్రి మండిపల్లి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబాలకు అప్పగించేలా చర్చలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.