NZB: జిల్లా స్థాయిలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో బోధన్‌లో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను బుధవారం జిల్లా సైన్స్ అధికారి గంగ కిషన్, మండల విద్యాధికారి నాగయ్య బృందంతో కలిసి పరిశీలించారు. విద్యార్థుల సృజనాత్మక ప్రతిభ, సాంకేతిక విజ్ఞానం, శాస్త్ర అవగాహనను ప్రదర్శించే ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.