WNP: కలెక్టర్ కార్యాలయంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఆధ్వర్యంలో రెవెన్యూ సాధన సమితి సభ్యులు కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి శనివారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఆత్మకూరులో అన్ని వసతులు ఉన్నాయని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు, ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.