ఖమ్మం: ఈనెల 11న హైదరాబాద్లోని బస్సు భవనం నందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె. అర్జునరావు కోరారు. మంగళవారం వైరా మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇంటి స్థలంలేని వారికి ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. రైతాంగ రుణాలను రద్దు చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు.