WGL: బీజేపీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం వరంగల్లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు నర్సంపేట నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు వరంగల్ తరలివెళ్లారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కార్యకర్తలు బయలుదేరారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.