WNP: చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జిల్లా డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి. కృష్ణయ్య అన్నారు. గురువారం వనపర్తిలోని ఓ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఫొక్సో చట్టం గురించి వివరించారు.