WNP: జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని రేవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సీనియర్ జడ్జి రజిని మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు నమోదు అవుతాయని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.