JGL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 2,930 ఓటర్లకు గానూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2,287 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1416, మహిళలు 1514 మంది ఓటు వేశారు. దీంతో పోలింగ్ శాతం 78.05గా నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.