NRPT: హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాన పట్టణంలోని కూడళ్ళలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.