»Brs Will Do Another Campaign For Krishna Board In Telangana Kcr
KCR: తెలంగాణలో మరో ప్రజా ఉద్యమం
మూడు నెలల విరామం తరువాత తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాటు చేసి మరో ప్రజా ఉద్యమాన్ని చేపడుదాం అని పిలిపునిచ్చారు.
BRS will do another campaign for Krishna Board in Telangana. KCR
KCR: కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వలన రైతులకు సాగునీరు అందదు అని వెల్లడించారు. దీని కోసం కృష్ణ జలాల పరిరక్షణ సభను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. తుంటికిి శస్త్రచికిత్స అనంతరం దాదాపు మూడు నెలల తరువాత తెలంగాణ భవన్‌కు వచ్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహబూబనగర్, నల్గొండ, రంగారెడ్డి పార్టీ నాయకులతో కేసీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షమే ఉంటుంది. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టులు కృష్ణబోర్డు(Krishna Board)కు అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువ పనిగా పరగణిించారు. అలా చేస్తే డ్యామ్‌లకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్తేమి కాదని, ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించవద్దనే మా పోరాటం అని తెలిపారు. అందుకోసం నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఎంత దూరం అయినా వెళ్తామని, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెబుదాం అని కేసీఆర్ అన్నారు.