»Mlc Kavitha Said That A Case Should Be Filed Against Cm Revanth Reddy
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని, లేదంటే కోర్టులో తేల్చుకుంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇది రాచరికపు పాలనను తలపిస్తుందని వ్యాఖ్యనించారు.
MLC Kavitha said that a case should be filed against CM Revanth Reddy
MLC Kavitha: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్(Balka Suman)పై కేసు పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలిని లేదంటే తాము కోర్టుకు వెళ్తామని డీజీపీ కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కవిత తన ఎక్స్ యాప్ వేదికగా స్పందించారు.
“బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు” అని పేర్కొన్నారు.
“నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది. సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలి. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతాం.” అని రాసుకొచ్చారు. దీనిపై నెట్టింట్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…