జనవరి 31 నుంచి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. దీంతో రాష్ట్రపతి సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. 2022 లోనూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది. ఆ తర్వాత రోజు నుంచి కేంద్ర విధానాలు, రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక తీరుపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడనున్నారు. తెలంగాణ పెండింగ్ హామీలపైన కూడా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయనున్నారు. అలాగే.. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/phkY3i2OaJ