కామారెడ్డిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తనకు కేటాయించిన గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నావని అడిగితే.. జెడ్పీటీసీపై ఎంపీపీ పిడి గుద్దులు గుప్పించాడు.
BRS Mpp Attack: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు వేడెక్కాయి. సభలు, సమావేశాలతో అధినేతలు బిజీగా ఉన్నారు. వీలైనన్నీ ఎక్కువ సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల కోలాహలం నెలకొంది. కొన్ని చోట్ల బీ క్యాడర్లో లుకలుకలు మొదలయ్యాయి. అవును.. విభేదాలు మెల్లిగా బయట పడుతున్నాయి.
కామారెడ్డి (kamareddy) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. ఈ సీటు గెలిపించుకోవడం ఆ పార్టీకి ఇంపార్టెంట్. ఒక్కో నేతకు ఒక్కో ఊరు, వాడ అప్పగించారు. అలానే చుక్కాపూర్ గ్రామాన్ని జెడ్పీటీసీ విన్నూరి రాంరెడ్డికి కేటాయించారు. ఆయన అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు.
చుక్కాపూర్ గ్రామానికి ఎంపీపీ నర్సింగ రావు వచ్చారు. అక్కడ ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో రాం రెడ్డి (ram reddy) ప్రశ్నించారు. తననే అడుగుతావా అని దాడి చేశాడు. రాంరెడ్డికి గాయాలు అయ్యాయి. అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. కుడి కన్ను పక్కన గాయమైంది. విషయంపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇద్దరికీ పిలిచి వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.
ఎన్నికల్లో గెలవాలని అధినేత కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతుంటే.. బీ క్యాడర్ నేతలు మాత్రం ఇలా గొడవలు చేసుకుంటున్నారు. అంతా కలిసి వెళ్లాలని.. గొడవలు వద్దని చెబుతున్నారు.