తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హైదరాబాద్ ప్రగతిభవన్లో కలిశారు.తన కుమారుడు వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎం దంపతులకు శుభలేఖ అందించారు.అలాగే బ్రహ్మానందం స్వయంగా రెడీ చేసిన తిరుమల శ్రీవారి డ్రాయింగ్ కానుకగా అందించారు. బ్రహ్మానందం (Brahmananda) కుటుంబంతో కాసేపు సీఎం ముచ్చటించి పెళ్లి కబర్లు తెలుసుకున్నారు. బ్రహ్మానందంతోపాటు ఆయన సతీమణి.. పెద్ద కొడుకు గౌతమ్ సీఎంను కలుసుకున్నారు.
బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) నిశ్చితార్థం మే 21న ఐశ్వర్య అనే అమ్మాయితో జరగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హజరరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు.హాస్య నటుడిగానే కాదు.. బ్రహ్మానందం మంచి ఆర్టిస్టు కూడా. పెన్సిల్ డ్రాయింగ్ చేయడంలోనూ ఆయన మేటి. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా డ్రాయింగ్స్ (Drawings) వేస్తుంటారు. లాక్ డౌన్ సమయంలో ఆయన ఎన్నో డ్రాయింగ్స్ వేసి.. వాటిని తన సన్నిహితులకు.. సినీ ప్రముఖులకు బహుమతులుగా అందించారు.మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కృష్ణం రాజు వంటి స్టార్స్ అందరికి తాను స్వయంగా వేసిన డ్రాయింగ్స్ అందించి సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుమల శ్రీవారి డ్రాయింగ్ వేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు బ్రహ్మానందం.