»Fetus For Kcr And Ktr Revanth Reddys Shocking Comments
Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌లకు పిండం..రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!
తెలంగాణలో వరదల వల్ల 30 మంది వరకూ చనిపోయినా సీఎం కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సోమవారం కాంగ్రెస్ నేతలందరూ తద్దినం పెట్టాలని సూచించారు.
సీఎం కేసీఆర్ (Cm KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR)పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోందని, వరద బాధితుల అర్తనాదాలు సీఎం కేసీఆర్ సర్కార్‌కు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేని ప్రశ్నించారు.
కేసీఆర్(KCR)కి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముప్పుపై సమీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అలా చేయకుండా కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శలు గుప్పించారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్(KTR) పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారని, వరద సహాయక చర్యలు చేపట్టడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ(Telangana)లో మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసిన తప్పులేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదల వల్ల 30 మంది చనిపోయినా కేసీఆర్ పరామర్శించేందుకు వెళ్లకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రగతి భవన్లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందని, అందుకే వరద నీటితో తద్దినం పెట్టండని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చచ్చిపోయారని, అందుకే అందరూ సోమవారం తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.