ముంపు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేదంటూ కొత్తగుడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) వరద బాధితులు ఆందోళనకు దిగారు.రోడ్డెక్కారు వరద బాధితులు (Flood victims) నిరసన తెలిపారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పాటు వరద బాధిత పునరావస కేంద్రాలలో ఉంటున్న వారికి భోజనం (Meal) ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క చేతగానితనమని మండిపడుతున్నారు. భోజనం కూడా సమయానికి పెట్టకుండా తమను అర్ధాకలితో వాపోయారు.
అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్(District Collector), సబ్ కలెక్టర్, తాసిల్దార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పోదెం వీరయ్య(MLA Podem Veeraiah). తక్షణమే వారికి భోజనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.భద్రాచలం వద్ద గోదావరి నది పోటెత్తుతోంది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం ఉదయానికి మరో అడుగు పెరిగి 54.30 అడుగులుగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక (Danger warning) కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
చదవండి : King Cobra: పొలంలో 13 అడుగుల కింగ్ కోబ్రా..ఒళ్లు జలదరించే వీడియో