ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) ఆదేశాలతోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తనని తప్పించారని బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్(BRS)తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని జిట్టా విమర్మించారు.స్వయంగా ఈటల రాజేందర్ (EtalaRajender) బీజేపీని బలహీనపరిచారని, అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి చంకలో పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు.అకారణంగా తెలంగాణ ఉద్యమ కారుడినైన తనను బీజేపీ(BJP)నుండి సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు సమాధానం చెప్పకపోవటంతో గన్‌పార్క్ వద్ద జిట్టా మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్(liquor scam)కేసులో 14 మందిని జైల్లో పెట్టడానికి దొరికిన సాక్షాలు, ఆధారాలు సీఎం కేసీఆర్ కూతురు కవితను జైల్లో పెట్టడానికి దొరకడం లేదా అని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్(BL Santosh)ను ఎమ్మెల్యేల కొనుగోల కేసులో లాగడంతో భయపడి బీజేపీ అగ్రనాయకత్వం.. కవిత కేసును ఆపేసి మూనుగోడు ఎన్నికల్లో అర్ధాంతరంగా మధ్యలో వదిలేసిన మాట వాస్తవం కాదా? అంటూ జిట్టా బాలకృష్ణ రెడ్డి (Jitta BalakrishnaReddy) ప్రశ్నించారు.యువతలో మంచి క్రేజీ ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశం ఎంత కాలం పెండింగ్‌లో పెడతారు..? కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన వారిని సస్పెండ్ చేసి, పదవుల నుండి తొలగించి కేసీఆర్ కోవర్టులకు, పార్టీని నాశనంచేసే వారికి పెద్దపీట వేయడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని జిట్టా ప్రశ్నించారు.