»Comedian Prithvi Defeats Ambati Rambabu In Bro Movie Controversy
Prithvi: అంబటిని చిత్తుగా ఓడిస్తా కమెడీయన్ పృథ్వీ
బ్రో సినిమాలో డ్యాన్స్ ఎవరిని అనుకరించింది కాదని.. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో మీకు తెలియదని కమెడీయన్ పృథ్వీ అంటున్నాడు. మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని తెలిపారు.
Prithvi: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన తాజా చిత్రం బ్రో(BRO) శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉన్నాయని మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. ప్రముఖ కమెడీయన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ(Prudvi) క్లబ్లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ చేసిన డ్రెస్ మాదిరిగానే ఉందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఓడిపోయిన వాళ్లు అలాగే గంతులు వేస్తారు అంటూ దీనిపై అంబటి విమర్శలు చేశారు. కమెడీయన్ పృథ్వీ కూడా ఘాటుగానే స్పందించారు. అంబటిని అనుకరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఆయనేమన్నా ఆస్కార్ స్థాయి నటుడా అని ఎద్దేవా చేశారు. బ్రో సినిమాలో తనది బాధ్యతరహితమైన పాత్ర అని, పబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసే పాత్ర అని చెప్పారు. సినిమా దర్శకుడు బ్రో సినిమాలో చిన్న పాత్ర ఉంటుంది. రెండు రోజులు కాల్షీట్స్ కావాలని చెప్పారు. ఒకే అని చేసిన పాత్రే తప్పా… ఇది ఎవరిని ఉద్దేశించినది కాదన్నారు.
పవన్ కల్యాణ్ ఎలాంటివారో మీకు తెలియదు.. ఆయన ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం కాదన్నారు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని కొనియాడారు. సినిమాలోని డ్యాన్స్ కేవలం వినోదం కోసమే అని వైసీపీ వారు దాన్ని మరోలా అర్థం చేసుకుంటే చేసేది ఏమి లేదన్నారు. ఇక పవన్ వైసీపీ నేతలు ఎంత దారుణంగా అవమానించారో అందరికి తెలుసు మరీ దాన్ని ఏమనాలి అన్నారు. ఇక అంబటి రాంబాబుపై తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సత్తెనపల్లిలో కచ్చితంగా చిత్తుగా ఓడిస్తానని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. ఇక అంబటి విమర్శలపై జనసేన పార్టీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పృథ్వీ వెల్లడించారు.