కేంద్ర మంత్రి అమిత్షా (Amit Shah) రేపు రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి(Rajamouli), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తెలంగాణ (Telangana)పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నట్లు భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా ఈ నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా భేటీ అయి వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా రాజమౌళీ, ప్రభాస్(Prabhas)తో అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్ షా కలుసున్నారు.
గతంలో హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు వచ్చిన అమిత్ షా.. తన పర్యటనల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ (Jrntr), నితిన్, మిథాలీ రాజ్ సహా తదితరులను కలిశారు. దీంతో ఆదిపురుష్(Adipurush) హీరో ప్రభాస్, అమిత్ షా భేటీపై ఊహాగానాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు రాత్రికే హైదరాబాద్కి అమిత్ షా చేరుకోనున్నారు. వాస్తవానికి ఖమ్మం(Khammam)లో 15వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తర్వాత భద్రాచలం (Bhadrachalam)వెళ్తారు. అక్కడ రాములోరి దర్మించుకుంటారు.సమావేశానికి ఒకరోజు ముందే రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటనపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా ప్రచార కమిటీ చైర్మన్గా ఈటెలకు బాధ్యతలు మరిన్ని మార్పులంటూ కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీపై వార్తలు వస్తున్నాయి.