Non-Veg Pani Puri: స్నాక్స్ (snacks) అంటే ఇట్టే గుర్తొచ్చేవి.. పునుగు లేదంటే బజ్జీ.. మరికొందరు పానీ పూరీ (Pani Puri) అంటే ఇష్టపడతారు. అందులో పానీ పూరీతోపాటు దహీ పూరీ (dahi puri), స్వీట్ పూరీ (sweet puri).. కట్ లెట్, బెల్ పురీ రకరకాలు ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో (west bengal) ఓ వ్యాపారి వెజ్తోపాటు నాన్ వెజ్ పానీ పూరీ సేల్ చేస్తున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి.. ఆశ్చర్యపోతున్నారు. భోజన ప్రియులు మాత్రం ఇష్ట పడుతున్నారు.
అతని వద్ద మటన్ పానీ పూరీ (mutton Pani Puri), చికెన్ పానీ పూరీ (chicken Pani Puri), ప్రాన్ పానీ పూరీ, చాక్లెట్ పానీ పూరీ ఉన్నాయి. నాన్ వెజ్ (Non-Veg) అంటే ఇష్టపడే వారు మటన్ పుచ్కా, లేదంటే ప్రాన్ పానీ పూరీ టేస్ట్ చేయొచ్చు. వెట్కీ చేపలతో చేసిన పుచ్కాస్ అతని వద్ద ఉన్నాయి. వెజిటేరియన్లను ఇబ్బంది పెట్టకుండా చాక్లెట్, దహీ పుచ్కా అందచేస్తున్నాడు. దీంతో వారు కూడా లొట్టలేసుకుని మరీ పానీ పూరీ తింటున్నారు. నాన్ వెజ్ పానీ పూరీపై (Non-Veg Pani Puri) సోషల్ మీడియాలో డివైడ్ టాక్ చేస్తోంది. నిజమని, బాగుందని కొందరు చెబుతున్నారు. మరికొందరు అదేం లేదు.. అంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఇవీ కొత్త కాదు.. కొందరు ఇలా ట్రై చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నాన్ వెజ్ పానీ పూరీ (Non-Veg Pani Puri) వార్త హల్ చల్ అవుతోంది.