Pani Puri: Are you eating pani puri.. But be careful!
Pani Puri: చాలామంది ఇష్టంగా పానీపూరీ తింటుంటారు. అయితే ఈ పానీపూరీ తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తెలింది. అన్ని ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతుండటంపై ఆందోళనలు రావడంతో భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో సహా చాలా చోట్ల తనిఖీలు చేశారు. పానీపూరీ నమూనాల్లో సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలిందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
చాలా వరకూ శాంపిళ్లలో సన్సెట్ యోల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్లు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో వీటిని రాష్ట్రవ్యాప్తంగా నిసేధించే యోచనలో అధికారులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల గోబీ మంచురియా, కబాబ్ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృతిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసింది. కృత్రిమ రంగుల వల్ల అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.