Pani Puri Games On Google Doodle Occasion Of Anniversary
Google Doodle: ప్రముఖుల జయంతి, సంస్థ ఎస్లాబ్లిష్ అయిన తేదీని బట్టి గూగుల్ డూడుల్ రూపొందిస్తోంది. గూగుల్ డూడుల్‌పై (Google Doodle) ఈ రోజు పానీ పూరి (Pani Puri) కనిపిస్తోంది. కేవలం పానీ పూరి (Pani Puri) మాత్రమే కాదు.. లింక్ ఓపెన్ చేస్తే గేమ్స్ కూడా ఉన్నాయి. సో.. వాటితో ఏం చక్కా ఆడుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు దానిని చూస్తే వదిలిపెట్టరు.
పానీపూరి (Pani Puri) యానివర్సరీ సందర్భంగా గూగుల్ డూడుల్ పానీ పూరి గేమ్‌తో రూపొందించింది. ఆ గేమ్‌లో ప్లేయర్ ప్లేట్ పట్టుకున్న చేతిని నియంత్రిస్తాడు. పూరీలను గాలిలోకి షూట్ చేయడానికి, నోటితో వాటిని పట్టుకోవడానికి ప్లేట్‌పై క్లిక్ చేయాలి. ఎక్కువ పూరీలు నోటీకి అందితే అంత ఎక్కువ స్కోర్ చేసే వీలు ఉంది. ఈ గేమ్ ఆడే సమయంలో సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తోంది. క్యాండీ క్రష్ లాంటి మరో గేమ్‌ను డూడుల్ క్రియేట్ చేసింది. దేశంలో పానీపూరిపై ఉన్న ఆదరణకు గుర్తుగా గూగుల్ ఇలా క్రియేట్ చేసింది. అవీ చూసి నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. వావ్.. సింప్లీ సూపర్ అంటున్నారు.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఓ రెస్టారెంట్ 2015 జూలై 12వ తేదీన 51 రకాల నోరూరించే పానీపూరీ (Pani Puri) తయారు చేశారు. అప్పటినుంచి జూలై 12వ తేదీన దేశంలో పానీ పూరీ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పానీ పూరీని (Pani Puri) మహాభారత కాలంలో కనుగొన్నారని పురాణాలు చెబుతున్నాయి.