వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. నిన్న జరిగిన ఒక్క సంఘటనతో.. తెలంగాణలో సమీకరణాలన్నీ మారిపోవడం గమనార్హం.
తెలంగాణలో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిలకు వరంగల్ జిల్లాలో చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. షర్మిల ధ్వంసమైన తన వాహనంలోనే ప్రగతి భవన్ కు బయల్దేరారు. ఆ సమయంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్న తీరు కంటే..కారులోనే షర్మిల ఉన్న సమయంలో ఆ కారను లాగుతూ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లటం వివాదాస్పదమైంది.
షర్మిల పైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. కాగా, షర్మిల కు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర వ్యాఖ్యలు చేసారు. పోలీసులు వ్యవహరించిన తీరును వారంతా తప్పు బట్టారు. ఇదే సమయంలో గవర్నర్ తమిళసై స్పందించారు. షర్మిల అరెస్ట్ తీరు పైన ఆందోళన వ్యక్తం చేసారు. కొండా సురేఖ సైతం మద్దతు ప్రకటించారు. షర్మిల కారులో ఉండగానే లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని వ్యాఖ్యానించారు. గవర్నర్ ఈ మేరకు చేసిన ట్వీట్ ను పీఎంవో, డీజీపీకి ట్యాగ్ చేశారు. కాగా… తనకు మద్దతుగా నిలిచిన వారికి కవిత దన్యవాదాలు తెలియజేశారు.