»Big Alert For Police Candidates Written Exam Dates Finalised
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షల తేదీలు ఖరారు
రాష్ట్రంలో ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic),మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic),మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ (Language Paper) పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ పరీక్షలకు తెలంగాణలోని(Telangana) 10 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నియామక మండలి ప్రకటించింది. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న మధ్యాహ్నం.. కానిస్టేబుల్ మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలను కేవలం హైదబాద్లోనే నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (Hall tickets) ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే support@tslprb.in లేదా 9393711110/9391005006 నెంబర్లను సంప్రదించాలని తెలిపింది.