»Another Defamation Case Registered Against Congress Leader Rahul Gandhi At Haridwar Court On Aginst Rss Comment
Rahul Gandhi: రాహుల్ పై మరో పరువు నష్టం కేసు నమోదు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆరెస్సెస్(RSS) కార్యకర్త కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఏప్రిల్ 12న ఈ కుసు విచారణకు రానుంది. ఆర్ఎస్ఎస్ సభ్యలు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ హర్యానాలో వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మరో షాకింగ్ న్యూస్ తగిలింది. మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఫిర్యాదు మేరకు న్యాయవాది అరుణ్ భదౌరియా కేసు నమోదు చేశారు.
జనవరి 9, 2023న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్ర తర్వాత నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)ప్రసంగించారు. ఆ క్రమంలో RSS సభ్యులు “21వ శతాబ్దపు కౌరవులు అని వ్యాఖ్యలు చేశారు. కౌరవులు ఎవరు అనే దానికి ముందుగా మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతానని పేర్కొన్నారు. వారు హాఫ్ ఖాకీ ప్యాంట్లు ధరించి, చేతిలో లాఠీలు పట్టుకుని ఉంటారని తెలిపారు. వీరు దేశంలోని 2-3 బిలియనీర్లు కౌరవులతో నిలబడి ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశంపై ఏప్రిల్ 12న కోర్టులో విచారణ జరగనుంది.
2019లో మోడీని విమర్శించే క్రమంలో రాహుల్ గాంధీ… ఓబీసీకి చెందిన మోడీ అనే కులాన్ని మొత్తాన్ని కించపరిచారని చెబుతూ గుజరాత్(gujarat)కు చెందిన ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వెంటనే చట్ట సభ సభ్యుడి పైన అనర్హత వేటు ఉంటుంది. ఈ ప్రకారమే గతంలో లాలూ ప్రసాద్, తాజాగా లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ పైన లోకసభ సచివాలయం చర్యలు తీసుకున్నది. రాహుల్ విషయంలోను అదే జరిగింది.