Bandi Sanjay : హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ.. కేసీఆర్ కి బండి ట్వీట్స్..!
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్స్ చేశారు.
మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతిని ప్రతి నెల ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’ అని రాసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ‘మీ అకౌంట్ లో రూ.3,016 పడ్డాయి’ అనే మెసేజ్ ఉంది. కింద కేసీఆర్ నవ్వుతున్న ఫొటోను పెట్టారు.
‘‘నిరుద్యోగ యువతకు రూ.3,016 భృతి ఇస్తాం- సీఎం కేసీఆర్. మీరు దీనిని నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. బండి సంజయ్ మాదిరే నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ‘హుసేన్ సాగర్ లోకి కొబ్బరినీళ్లు’ ‘సిగ్నల్ ఫ్రీ సిటీ’, ‘ప్రతి మండలంలో 30 బెడ్ల ఆసుపత్రులు’ అంటూ గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీని ఎగతాళి చేస్తూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ‘‘నాకైతే రూ.15 లక్షలు పంపాడు మోడీ తాత. నీకు వచ్చాయా బంటి అన్న’’ అంటూ ఓ ఫేక్ మెసేజ్ తో కౌంటర్ ఇచ్చాడు.