BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులను పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. విశ్రాంత అధికారులు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు.