HNK: క్రిస్మస్ పండగను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో DMHO డా. అల్లం అప్పయ్య పాల్గొని సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, మానవత్వం, ప్రేమ వంటి విలువలను ఈ పండుగ గుర్తుచేస్తుందన్నారు.