KMM: పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ రావు తెలిపారు. ఇవాళ మధిరలోని ఎంపీ రేణుక చౌదరి క్యాంప్ ఆఫీసులో ముగ్గురు లబ్ధిదారులకు రూ.1,57,500 విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.