BHNG: రాజాపేట మండలం రేనికుంట, బేగంపేట గ్రామాలలో అక్రమ మద్యాన్ని ఆదివారం రాత్రి ఎస్సై లింగారెడ్డి స్వాదీనపరుచుకుని కేసు నమోదు చేశారు. పక్కా సమాచారం మేరకు రేణిగుంట గ్రామంలో కోరుకొప్పుల ఆంజనేయులు ఇంటి వద్ద, బేగంపేటలో నాగాయపల్లి హరినాథ్ వ్యక్తి నుంచి అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింగారెడ్డి చెప్పారు.