వరంగల్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలను ఎల్బీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరై, బాబు జగ్జీవన్ రావు సామాజిక న్యాయం కోసం చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.