VKB: దోమ మండలం శివారెడ్డి పల్లి గ్రామంలో నిర్మించిన నూతన మసీదును పరిగి ఎమ్మెల్యే & డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులతో సౌభ్రాతృత్వం, సామరస్య వాతావరణం కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ముస్లిం మత పెద్దలు, దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యేని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.