మెదక్: నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వ పక్క భవనాలు లేక మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలానికి 14 గ్రామపంచాయతీలు ఉన్న మండలానికి 108 అంబులెన్స్ లేదు. మండలంలో ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే 108 లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు స్పందించి అంబులెన్స్ మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.