BDK: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇవాళ పిలుపునిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనకై వంద రోజుల ప్రచార ఉద్యమ గోడ పత్రికను ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ ప్రచారంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.