NLG: ఈనెల13న జరగనున్న లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేరేడుగొమ్ము SI నాగేంద్రబాబు కోరారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీమార్గంలో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని అన్నారు. సమానన్యాయం జరగాలంటే రాజీమార్గమే రాజమార్గమని SI సూచించారు. ఈలోకదాలత్లో పాల్గొని ప్రతీకారాలకు పోకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.