NZB: మోపాల్ మండలం న్యాల్కాల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీవో కిరణ్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని పలు రికార్డులను, వంట గదిని, సామగ్రిని పరిశీలించారు. గర్భిణులకు, చిన్నారులకు ఎలాంటి భోజనం ఇస్తున్నారని అంగన్వాడి టీచర్ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ఇచ్చే బాలామృతం, పౌష్టికాహార సామగ్రిని ఎక్స్పైరీ డేట్ పరిశీలించారు.