KMM: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.