KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆరు గ్యారంటీల అమలుపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. రామచందర్ రావుతో పాటు కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.