KMR: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన విద్యా రవి ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆదివారం అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.