భాగ్యనగరంలో జూన్ 22వ తేదీ నుంచి ఆషాడ మాసం బోనాల పండుగ మొదలు కాబోతుంది. గోల్కొండ కోట(Golconda Fort)లోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో నెల రోజుల పాటు బోనాల జాతర (Bonala Jatra)మొదలు కాబోతుంది. ఈ మేరకు మంత్రి తలసాని (Minister Talasani) శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజా(Green Plaza)లో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు (Mahankali Bonalu), వచ్చే 10న రంగం (Rangam) నిర్వహిస్తామని అన్నారు.
జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్ర పండుగగా ప్రకటించారని తలసాని వెల్లడించారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ సంస్కృతి(culture)కి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం (State Govt) నలుదిక్కులా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.