»The Health Of Mp Avinash Mother Lakshmamma Is Stable
Avinash mother: మెరుగ్గా అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ(lakshmamma) ఆరోగ్యం గురించి తాజాగా హెల్త్ బులెటిన్ ను కర్నూలు విశ్వభారతి వైద్యులు రిలీజ్ చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని, డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(MP Avinash reddy )తల్లి లక్ష్మమ్మ(lakshmamma) ఆరోగ్యం గురించి తాజా హెల్త్ బులెటిన్ ను కర్నూలు విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని, ఈరోజు (శుక్రవారం) డిశ్చార్జి చేస్తారని ప్రకటించారు.
అయితే గుండె సంబంధిత చికిత్స కోసం ఆమెను మరో ఆస్పత్రికి రెఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం లక్ష్మమ్మను హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటుతో ఈనెల 19న కర్నూలు విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.