»Telangana Formation Celebrations At Golconda Fort
Kishan reddy: ఒక్కరి ద్వారా తెలంగాణ ఏర్పడలేదు..అనేక మంది పోరాడారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఏ ఒక్కరితోనే తెలంగాణ ఆవిర్భవించలేదు. అందరూ పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు జేఏసీలో ఉండి మా పార్టీ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనలో మా పార్టీ గుండెచప్పుడైంది.
తెలంగాణ ఆవిర్భావ సంబరాలు (Telangana Formation Celebrations) రాష్ట్రంలోనే కాదు దేశంలో 20 రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం (Govt of India) ఆధ్వర్యంలో తొలిసారి తెలంగాణ అవతరణ ఉత్సవాలు జరిగాయి. హైదరాబాద్ (Hyderabad) గోల్కొండ కోటలో సంబరాలు జరగగా.. దేశంలోని ఆయా రాష్ట్రాల రాజ్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహించింది. గోల్కొండ కోటలో (Golconda Fort) జరిగిన సంబరాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఏ ఒక్కరితోనే తెలంగాణ ఆవిర్భవించలేదు. అందరూ పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు జేఏసీలో (JAC) ఉండి మా పార్టీ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనలో మా పార్టీ గుండెచప్పుడైంది. పార్లమెంట్ (Parliament)లో బిల్లు పాస్ కావడంలో మేం పాత్ర పోషించాం. రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన సుష్మా స్వరాజ్ (Sushma Swaraj)కు కూడా నివాళులర్పించాలి’ అని తెలిపారు.
కాగా, ఈ ఉత్సవాల్లోనూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేశారు. ‘కష్టపడి సాధించుకున్న రాష్ట్రం దగాకోరుల పాలవుతోంది. అప్పుల (Debts) కుప్పగా రాష్ట్రం మారింది’ అని ఆరోపణలు చేశారు. కాగా అంతకుముందు పోలీసుల గౌరవ వందనం (Parade) స్వీకరించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం గోల్కొండ కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.