school holidays in telangana:ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ ఉంటుందని ప్రకటన చేశారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ (half day school) ఉంటుందని ప్రకటన చేశారు. అలాగే స్కూల్ హాలీడే గురించి కూడా ప్రకటన చేశారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి సెలవులు ఉంటాయిన చెప్పారు. మార్చి 15వ తేదీ నుంచి ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించాలు జారీచేసింది.
పదో తరగతి పరీక్షలు (ssc exams) ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరుగనున్నాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తారు. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్ 17తో పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తామని ప్రకటించారు.
ఈ ఏడాది కూడా ఎండల (heat wave) తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఎండలు ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. తర్వాత వర్షకాలం కూడా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చలికాలంలో కూడా తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అస్తామా రోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఎండలు ఠారెత్తిస్తున్నాయి.