కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 23వతేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్కార్ పురస్కారం పొందిన ఆర్ఆర్ఆర్ (RRR) టీమ్ తో ఆయన భేటీ కానున్నారు.
తెలంగాణకు రేపు అమిత్ షా (Amit Shah) పర్యటన ఖరారైంది .బహిరంగ సభలో పాల్గొనేందుకు చేవెళ్ల (Chevella) వస్తున్న అమిత్ షా(Amit Shah).. అదే రోజు ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్(RRR) టీమ్‌కు నొవోటెల్ లో విందు ఇవ్వనున్నారు. వారిని సన్మానించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్,(Ram charan) రాజమౌళి(Rajamouli), కీరవాణి, చంద్రబోస్‌తో పాటు విజయేంద్రప్రసాద్‌కు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. అనంతరం గంటపాటు తెలంగాణ (Telangana) నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. అదే రోజు సాయంత్రం చేవేళ్లలో బహిరంగ సభ ఉంటుంది.
ఇక గతేడాది ఆగస్టు 22న అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. నడ్డాతో నితిన్, మిథాలీ రాజ్(Mithali Raj) భేటీ అయ్యారు. కర్నాటక(Karnataka)లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఆదివారం అమిత్ షా వెళ్తున్నారు. మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి.. దగ్గర్లోని చేవెళ్ల లేదా వికారాబాద్‌లో రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొననున్నారు. ప్రధాని టూర్ ముగిసిన 15 రోజుల వ్యవధిలోనే అమిత్ షా రానుండటంతో రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ ఏర్పాట్ల సక్సెస్‌పై చర్చించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) బీజేపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.చేవెళ్ల సభలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.