ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన వారే. రాజాసింగ్ ఒక్కరే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాగా.. మహేశ్వర్ రెడ్డి 2009లో ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని రాజాసింగ్‌తో పాటు పాయల్ శంకర్ కూడా ఆశించారు. అయితే అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత బీజేఎల్పీ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికే బీజేఎల్పీ నేతగా ఎక్కువ అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే. మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.