NLG: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఎ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పేద ప్రజల హక్కుల కోసం రాఘవరెడ్డి చేసిన అలుపెరగని పోరాటాలు చిరస్మరణీయమని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి శంకర్ పేర్కొన్నారు.