ADB: ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకుని రచయితగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. గురువారం తాంసి మండలంలోని పొన్నారి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల రచించిన గేయాల సంపుటి ‘మోదుగ మొగ్గలు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తక పఠనానికి దూరం కాకూడదని సూచించారు.