NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం ఆవరణలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష పదవికి సురేష్, శ్యామ్, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పెద్దల సమక్షంలో నంద్యాల శ్యామ్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజులదేవి పవన్ ప్రధాన కార్యదర్శిగా, సందీప్ కోశాధికారిగా, సురేష్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.