KNR: మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డితో కలిసి మూడు వివో భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాలకు భూమిపూజ చేశారు.